Sunday, 24 October 2021

‘పుష్ప’ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసిన అల్లు అర్జున్ ... అసలు ప్లాన్ ఏంటంటే?

ఐకాన్ స్టార్ హీరోగా తన రేంజ్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపే ఉంది. అయితే, మార్కెట్ ప‌రంగా దాన్ని డెవ‌ల‌ప్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు బ‌న్నీ. అందుకోసం, సినిమాను వేదిక‌గా చేసుకున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న పుష్ప సినిమాను ప‌క్కా ప్ర‌ణాళిక‌తో తీసుకొస్తున్నారు మ‌న అల్లు వారి హీరో. ప్ర‌మోష‌న్స్ విష‌యంలోనూ బ‌న్నీ ఏమాత్రం త‌గ్గ‌కుండా పుష్ప సినిమాను ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు. ఒక‌ప్పుడంటే తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌ల‌యాళం వ‌ర‌కు మాత్ర‌మే అల్లు అర్జున్ ఫోక‌స్ చేస్తూ వ‌చ్చాడు. కానీ పుష్ప లెక్క‌లు వేరుగా ఉన్నాయి. ప్ర‌మోష‌న్స్ కోసం స్టైలిష్ స్టార్ భారీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నార‌ట‌. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు, ద‌క్షిణాదిన ఉన్న నాలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప‌ట్టణాల‌కు వెళ్లి ‘పుష్ప’ సినిమాను ప్ర‌మోట్ చేయాల‌ని బ‌న్నీ అనుకుంటున్నార‌ట‌. న‌వంబ‌ర్ రెండు, మూడు వారానికంతా సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచే ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు బాలీవుడ్‌లో ప్ర‌మోష‌న్స్‌పై ఫోక‌స్ పెట్టేశార‌ట‌. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధ‌మైంది. ఇక పుష్ప షూటింగ్ పూర్తి కావ‌డ‌మే త‌రువాయి. రెండు భాగాలుగా రూపొందుతోన్న పుష్ప మూవీలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం కావ‌డంతో పాటు సినిమాలో పుష్ప పాత్రను ఎలివేట్ చేసేలా విడుదలైన క్యారెక్టర్ టీజర్‌కు, విడుదలైన రెండు సాంగ్స్‌ బావుండటంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి రెట్టింపు అయ్యాయి. రంగ స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కూడా కావ‌డంతో సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా పుష్ప ది రైజ్ కోసం వేచి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్‌లకు ఎంతో కీలకం. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకోవడానికి వీరిద్దరూ బాగానే కష్టపడే ఉంటారని అనుకోవచ్చు. చిత్తూరు జిల్లాలోని శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప మూవీ తెర‌కెక్కుతోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపించే పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9Erys
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...