Saturday, 23 October 2021

మద్యం మత్తులో మైకం కమ్మేసినట్టుంది!.. అర్జున్ కపూర్‌‌ను ముద్దులతో ముంచెత్తిన మలైక

బాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథలున్నాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అదే మలైకా అరోరా ప్రేమ కథ. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వదిలేసిన మలైకా అరోరా ఆ తరువాత అర్జున్ కపూర్ ప్రేమలో పడింది. మలైకా అరోరా ప్రేమలో అర్జున్ కపూర్ పడ్డాడా? అర్జున్ కపూర్ ప్రేమలో మలైకా పడిందా? అంటూ నెటిజన్లు వేసే సెటైర్లు అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ఇద్దరి మధ్య పుష్కర కాలం వయోబేధం ఉంటుంది. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏం ఉంటుందని అంటారా? అది కూడా నిజమే. అయితే తన ప్రేయసి మలైక బర్త్ డేను అర్జున్ కపూర్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సెలెబ్రేషన్స్‌లో కరీన కపూర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అర్జున్ కపూర్ షేర్ చేసిన ఫోటోను తీసింది తానేనని, కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని కరీనా కపూర్ కామెంట్ చేసింది. అంటే వీరంతా ఒకే చోట ఉన్నారని తెలిసిపోతోంది. అయితే ఈ ఫోటోలో మాత్రం అర్జున్ కపూర్, మలైక అరోరా మంచి ఫాంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముందు మద్యం సీసాలు, చేతిలో మందు గ్లాసుతో మాంచి కిక్కులో మలైక ఉన్నట్టు కనిపిస్తోంది. అలా మైకం బాగానే ఎక్కేసినట్టుంది. అందుకే అర్జున్ కపూర్‌పై మలైక ముద్దుల వర్షాన్ని కురిపించింది. ఈ రోజే కాదు నిన్ను ప్రతీ రోజూ ఇలానే నవ్విస్తూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. ఈ ఏడాది నీకు మరింత నవ్వులు తీసుకొస్తాను, రావాలి అని కోరుకున్నాడు. 2018 నుంచి ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అర్బాజ్ ఖాన్‌తో ఉన్న 19 ఏళ్ల వివాహా బంధాన్ని 2017లో మలైక రద్దు చేసుకుంది. వారిద్దరికి 18 ఏళ్ల కొడుకు (అర్హాన్) ఉన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3E806Np
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...