Thursday, 7 October 2021

ఆడ- మగ, మోరల్ వాల్యూస్‌ అంటూ సమంత ఎమోషనల్.. ఏకంగా ఆ మాట అనేస్తూ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ స్వీట్ కపుల్ సమంత- నాగ చైతన్య డివోర్స్ ఎంతోమంది అభిమానులను బాధ పెట్టింది. ఎంతో అన్యూన్యంగా ఉండే ఈ జోడీ విడిపోవడం వారి వారి ఫ్యాన్స్ గుండెలను ముక్కలు చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల తాము ఒకరికి ఒకరం దూరమవుతున్నామని, ఇకపై స్నేహితుల్లాగే కొనసాగుతామని చై- సామ్ ఇద్దరూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో విడాకుల ప్రకటన తర్వాత పెట్టిన తొలి పోస్ట్ చూసి కొందరు కంటతడి పెట్టుకున్నారు. ఎంతో బరువెక్కిన హృదయంతో సమంత బాధపడుతోందని ఆ పోస్ట్ ద్వారా అర్థం చేసుకొని కలత చెందారు. డైరెక్టుగా విషయం చెప్పకుండా కొటేషన్స్ రూపంలో తన మనసులో భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తోంది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె మరో కొటేషన్ పోస్ట్ చేయడంతో ఆ సందేశం వైరల్‌గా మారింది. ''ఎప్పుడూ ఆడవాళ్లనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎందుకు ప్రశ్నించదు. అలాంటప్పుడు ఈ సమాజంలో ప్రాథమికంగా నైతికత లేనట్లే కదా'' అంటూ రాసిన ఓ కొటేషన్‌ను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది సామ్. దీంతో ఈ పోస్ట్ అర్థాలు వెతుకుతున్న నెటిజన్లు.. సమంత, తనపై నడుస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఇలాంటి కొటేషన్‌ షేర్ చేసిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు విడాకుల ప్రకటన తర్వాత సమంత కదలికను ప్రతి క్షణం పరిశీలిస్తున్నారు జనం. రీసెంట్‌గా వస్తున్న వార్తల సారాంశాన్ని బట్టి చూస్తే.. విడాకుల ప్రకటన తర్వాత సమంత చాలా కుంగిపోయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ యాడ్ షూట్ షూటింగ్‌లో పాల్గొన్న సామ్.. షూట్‌ గ్యాప్‌లో గత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AyT8iB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...