Thursday, 28 October 2021

తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ అలా.. ఏకంగా బన్నీనే రప్పించనున్న రౌడీ

రౌడీ స్టార్ అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. విజయ్ సాయం అడిగితే ఏ హీరో అయినా సరే ముందుకు వస్తాడు. సాయం చేస్తాడు. అలా అంతటి స్టార్డంను సొంతం చేసుకున్న విజయ్.. తన తమ్ముడి కోసం ప్రమోషన్స్‌లోకి దిగాడు. తన తమ్ముడి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే దేవరకొండ బ్రదర్స్ అంటూ రకరకాల విషయాలను, సీక్రెట్లను రివీల్ చేస్తూ విజయ్, ఆనంద్‌లు ఓ వీడియోను వదిలారు. అందులో విజయ్ చెప్పిన పెళ్లి ముచ్చట్లు బాగానే వైరల్ అయింది. అలా పుష్పక విమానం సినిమా వీలైనంతగా ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. పుష్పక విమానం కోసం అల్లు అర్జున్‌ను రంగంలోకి దించాడు. పుష్పక విమానం సినిమా ట్రైలర్‌ను చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు వదిలిన అప్డేట్ వైరల్ అవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బన్నీ రాబోతోన్నాడు అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించాడు. అలా తమ్ముడి కోసం బన్నీని రంగంలోకి దించేలా ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. పుష్ప రాజ్ తమ పుష్పక విమానం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారంటూ ఆ టీం మొత్తం ఫుల్ జోష్‌లో ఉంది. మొత్తానికి నవంబర్ 12న పుష్పక విమానం థియేటర్లో సందడి చేయనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GwAuvB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...