Thursday, 7 October 2021

షారుఖ్ తనయుడికి మద్దతుగా హృతిక్ రోషన్.. దిగజారిపోయావంటూ ఫ్యాన్స్ ఎమోషనల్

ప్రస్తుతం బాలీవుడ్, నేషనల్ మీడియా మొత్తం , ఆర్యాన్ ఖాన్‌ల గురించే మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడటం, ఇప్పుడు ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉండటం, పైగా జైలుకు తీసుకెళ్తున్న సమయంలో కారులో కూడా ఆర్యాన్ ఖాన్ నవ్వుతూ కనిపించడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్యాన్‌కు సపోర్ట్‌గా వేసిన పోస్ట్ తీవ్రంగా చర్చలోకి వచ్చింది. ‘మై డియర్ ఆర్యాన్, జీవితమనేది ఓ వింత ప్రయాణం. అది అర్థం కానట్టుగా తికమకగా ఉంటుంది కాబట్టే అంత గొప్పది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలను బంతుల్లా విసురుతుంది. కానీ ఆ దేవుడు ఎంతో దయగలవాడు. ఎదుర్కునే వాడికే ఆ కష్టమైన బంతులను విసురుతాడు. ఇలాంటి కష్టకాలంలో ఇంత ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుసు. ఇందతా నువ్ అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో సమస్యలు, చిక్కుముళ్లున్నాయి. వాటన్నంటిలోంచి నువ్ హీరోగా బయటకు రావాలి. ఇలాంటి వేడి నీలోని హీరోను బయటకు తీసుకొస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండు. ఆ వేడే నీలోని మంచిని, ప్రేమను, దయను కూడా దహించి వేస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, వాటిని ఎదుర్కొన్నప్పుడే ఇంకా ఎత్తుకు ఎదుగుతాం. బాల్యం నుంచి నువ్ నాకు తెలుసు. ఇప్పుడు ఇంత పెద్దవాడివి అయ్యావ్. వీటన్నింటిని అనుభవంగా తీసుకో. అవన్నీ బహుమతులే అనుకో. ఇలాంటి కష్టాలను ఒకదాంతో మరొకటి కలుపుకుంటే నీకే అసలు సమస్య అర్థమవుతుంది. నన్ను నమ్ము. చీకటి త్వరలోనే పోతుంది. వెలుగులు వస్తాయి’ అని హృతిక్ రోషన్ పోస్ట్ చేశాడు. ఇక ఆర్యాన్ ఖాన్‌కు మద్దతుగా ఇలా హృతిక్ రోషన్ వేసిన పోస్ట్‌పై సెలెబ్రిటీలు సంబరపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలోని సాధారణ జనాలు మాత్రం చీదరించుకుంటున్నారు. ఇంత వరకు నీపై ఉన్న మర్యాద, గౌరవం ఇప్పుడు పోయాయి.. నువ్ దిగజారిపోయావ్ అని మండిపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ai7kS4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...