ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (46) కన్నుమూశారు. ఈ రోజు (అక్టోబర్ 29) శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన్ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే పునీత్ రాజ్‌కుమార్ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తతో యావత్ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన తార పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున జనం ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. పునీత్‌కి గుండెపోటు అని తెలియగానే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోవడం జరిగింది. 1975 మార్చి 17న జన్మించిన పునీత్ రాజ్ ఇప్పటి వరకు 29 సినిమాల్లో నటించారు. ఈయన్ని కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఐదేళ్ల వయసులోనే ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vTlgfi
v
No comments:
Post a Comment