Monday, 25 October 2021

క్యాన్సర్‌తో పోరాడుతున్న లిరిసిస్ట్ కందికొండ.. సాయం కోసం వేడుకుంటున్న కోన వెంకట్

తెలంగాణ నుంచి టాలీవుడ్‌లో ఉన్న పాటల రచయితలే చాలా తక్కువ మంది. ఒకప్పుడు పాటలకు ఎంతో ఆదరణ ఉండేది. పూరి జగన్నాథ్ సినిమాలంటే కందికొండ ఫేమస్. ఆయన రాసిని ఎన్నో మెలోడీ, మాస్ సాంగ్‌లు ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే గత కొంత కాలం నుంచి కందికొండ బతుకమ్మ పాటలు రాస్తూ బిజీగా మారిపోయాయి. అలాంటి కందికొండ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. క్యాన్సర్‌తో కందికొండ బాధపడుతున్నారు. కందికొండను కాపాడమంటూ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏకంగా మంత్రి కేటీఆర్‌ను కూడా వేడుకున్నాడు. కాపాడండి అంటూ కందికొండ పరిస్థితి ట్వీట్ ద్వారా తెలియజేశాడు. కానీ ఇంకా కేటీఆర్ నుంచి స్పందన రానట్టు కనిపిస్తోంది. తాజాగా కోన వెంకట్ మరో ట్వీట్ వేశాడు. కందికొండకు రేపు ఆపరేషన్ అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. కందికొండకు రేపు సర్జరీ చేయబోతోన్నారు. నా వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను.. మీరు కూడా మీకు తోచిన మొత్తానికి విరాళంగా ఇవ్వండని అందరినీ కోరాడు. ఈ మేరకు ఓ గూగుల్ పే నంబర్‌ను కూడా షేర్ చేశాడు. కోన వెంకట్ చేస్తోన్న ఈ ప్రయత్నం కందికొండను కాపాడాలని, ఆపరేషన్‌కు కావాల్సిన మొత్తం సమకూరాలని అంతా కోరుకుంటున్నారు. మల్లికూయవే గువ్వా.. అనే పాటతో కందికొండ సినీ ప్రయాణం మొదలైంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి ఇలా పూరి జగన్నాథ్ సినిమాలకు ఎన్నోన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3juBbvG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...