Saturday, 2 October 2021

‘రిపబ్లిక్’పై నిహారిక రివ్యూ.. గర్వంగా ఉంది బావ అంటూ ఎమోషనల్

మెగా హీరో రిపబ్లిక్ చిత్రం మొత్తానికి విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సాయి ధరమ్ తేజ్‌కు బైక్ ప్రమాదం జరగడం, ఇంకా కోలుకోలేకపోవడం, అయినా కూడా సినిమాను ముందుకు తీసుకురావడంతో జనాలు ప్రేమను కురిపించారు. చిత్రానికి బ్రహ్మరథం పట్టేశారు. మెగా హీరోలందరూ కలిసి రిపబ్లిక్ చిత్రాన్ని ముందుండి నడిపించారు. తాజాగా మెగా డాటర్ తన దైన శైలిలో రిపబ్లిక్ చిత్రంపై రివ్యూ ఇచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేశాడు.. బావా నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఎంతో ఆసక్తికరంగా.. ప్రభావితంగా ఉంది. నేను ఇంత వరకు చూసిన పొలిటికల్ డ్రామా సినిమాల్లోకెల్లా ఇది ప్రత్యేకంగా ఉంది. క్లైమాక్స్ మాత్రం ఎంతో కష్టంగా ఉంది. ఆ చేదు నిజాన్ని జనాలు అలా తేలిగ్గా తీసుకుంటారు.. రమ్యకృష్ణ గారు, ఐశ్వర్యా రాజేష్ గారు జగపతి బాబు గారు ఎంతో అద్భుతంగా నటించేశారు’ అని నిహారిక చెప్పుకొచ్చారు. అయితే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్‌లో స్యాడ్ ఎండింగ్ ఇవ్వడంతో అభిమానులు తట్టుకోలేకపోతోన్నారు. జనం కోసం నిలబడ్డ అధికారిని ఆ జనాలే తిరిగి అంతం చేయడాన్ని భరించలేకపోతోన్నారు. అయితే అదే విషయాన్ని నిహారిక టచ్ చేసింది. కొంచెం కష్టంగా ఉందని క్లైమాక్స్ గురించి నిహారిక పేర్కొంది. జనాలకు కూడా అదే ఫీలింగ్ ఉంది. నిహారిక చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3irffB8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...