Friday, 29 October 2021

హాస్పిటల్‌లో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. పరిస్థితి అత్యంత విషమం.. వెంటిలేటర్‌‌పై చికిత్స

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్(46) శుక్ర‌వారం బెంగుళూరులో గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం ఈయ‌న జిమ్ చేస్తుండ‌గా గుండె నొప్పి రావ‌డంతో ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయారు. ఆయ‌న్ని వెంట‌నే బెంగుళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. వెంటిలేట‌ర్‌పై ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా హాస్పిటల్ చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈయ‌న 1975 మార్చి 17న జన్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 సినిమాల్లో న‌టించారు. ఈయ‌న్ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మలో ప‌వ‌ర్ స్టార్ అని, అప్పు అని ముద్దుగా పిలుస్తుంటారు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ మూడో త‌న‌యుడు పునీత్ రాజ్‌కుమార్‌. ఐదేళ్ల వ‌య‌సులోనే ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తండ్రి రాజ్ కుమార్‌తోనూ క‌లిసి న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31cGR7n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...