Wednesday, 20 October 2021

సాయి ధరమ్ తేజ్‌ను కలిసిన హరీష్ శంకర్.. అదిరిపోయే ఫోటోతో అప్డేట్

మెగా హీరో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఓ వైపు దసరా, మరో వైపు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే, ఇంకో వైపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో మెగా ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. అయితే సాయి ధరమ్ తేజ్ ఫోటో మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. తాను బాగున్నాను అంటూ అప్డేట్ ఇస్తూ థమ్సప్ సింబల్ మాత్రం పెట్టేశాడు. దీంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు సపరేట్‌గా పోస్ట్‌లు చేశారు. తేజూ డిశ్చార్జ్ అయ్యాడు.. క్షేమంగా ఉన్నాడు.. దసరా రోజునే ఇలా మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నాడు. ఇక తేజు ఆరోగ్యం కోసం ఎంతో మంది ప్రార్థనలు, పూజలు చేశారు.. వారి ప్రార్థనలు ఫలించాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ కోలుకుని ఇంటికి రావడంతో అభిమానులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇసుక వల్ల బైక్ స్కిడ్ అయి సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, అలా దాదాపు రెండు మూడు వారాలు బెడ్డు మీద సాయి ధరమ్ తేజ్‌కు చికిత్స అందించడంతో అభిమానులు ఆందోళన చెందారు. చివరకు అంతా మంచే జరిగింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు సుప్రీమ్ హీరోను కలిశాడు. హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్‌ను కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టానని అన్నాడు. అంతే కాకుండా త్వరలోనే రాబోతోన్నాడు.. కుమ్మేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఓ ఫోటోను షేర్ చేశాడు.ఇందులో తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నట్టు, భరోసా ఇచ్చినట్టు పరోక్షంగా చెప్పేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lVN3sm
v

No comments:

Post a Comment