Thursday, 28 October 2021

అది కావాలా అంటూ కసిగా వర్ష! అక్కడ లేదంటూ ఇమ్మానుయేల్ పరువు తీసిన రష్మీ.. వీడియో వైరల్

గత ఏడేళ్లకు పైగా జబర్దస్త్ పంచుతున్న వినోదానికి ఏ మాత్రం డోకా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్‌తో ఇంటింటా నవ్వుల హరివిల్లులు కురిపిస్తున్నారు జబర్దస్త్ కమెడియన్లు. ఇదిలా ఉంటే ఇదే ఈ షోలో యాంకర్, జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న అనసూయ, , రోజా, మనో వేసే పంచులు మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. సందర్భానుసారంగా జబర్దస్త్ కమెడియన్స్ గాలి తీస్తూ నవ్వుల బాణాలు విసురుతున్నారు వీళ్లంతా. ఈ క్రమంలోనే తాజాగా అందరి ముందే పరువు తీసేసింది యాంకర్ రష్మీ. సాధారణంగానే ఇమ్మానుయేల్- జోడీకి యమ డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరూ రొమాంటిక్ స్కిట్ వేశారంటే ఇక టీఆర్ఫీకి రెక్కలు తొడిగినట్లే. అయితే తాజాగా ఇమ్మానుయేల్- వర్ష జోడీ వేసిన ఓ రొమాంటిక్ స్కిట్‌లో వేలు పెట్టింది యాంకర్ రష్మీ. ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర సన్నివేశం హైలైట్ అయింది. 'ఉప్పెన' సినిమాలోని రొమాంటిక్ సీన్స్, జల జలపాతం రొమాంటిక్ సాంగ్ చేసేందుకు వేదికపైకి వచ్చారు ఇమ్మానుయేల్- వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌తో ఎంటరై వచ్చి రాగానే ఆకట్టుకున్నారు. నీకు జ్వరం కావాలా? అంటూ ముద్దుముద్దుగా వర్ష అడగడంతో కావాలి అన్నాడు ఇమ్మానుయేల్. దీంతో ఉల్లిగడ్డలు చేతిలో పెట్టింది వర్ష. ఆపై సంకలో పెట్టుకో జ్వరం వస్తుంది అని జబర్దస్త్ పంచ్ వేసింది రోజా. ఇక ఆ వెంటనే.. 'మరీ అంత కోప్పడకు ముసలోడివి అయిపోతావ్' అని వర్ష అనగా.. ఉప్పెనలో వైష్ణవ్‌లా ఆయన్ను ఇమిటేట్ చేశాడు ఇమ్మానుయేల్. అయితే ఇక్కడ మీసం తిప్పే బదులు తలపై ఉన్న వెంట్రుకలు తిప్పే ప్రయత్నం చేశాడు. అది చూసిన రష్మీ.. అక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు అంటూ ఇమ్మానుయేల్ గాలి తీసేసింది. ఆ తర్వాత పడవలో రొమాంటిక్ పాటతో తెగ ఆకట్టుకున్నారు ఇమ్మానుయేల్- వర్ష. అలా మొత్తానికి ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZBJqiQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...