Wednesday, 6 October 2021

వీడితో ఎలా బతుకుతున్నావ్?.. భార్య ముందే ప్రకాష్ రాజ్ పరువుదీసిన చిరంజీవి

ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. మా ఎన్నికల మాటల యుద్దం, ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రకాష్ రాజ్ నెట్టింట్లో ప్రకాష్ రాజ్ వైరల్ అవుతున్నాడు. తాజాగా ప్రకాష్ రాజ్ షోకు గెస్టుగా వచ్చాడు. ఈక్రమంలో ప్రకాష్ రాజ్ ఎన్నో విషయాల మీద స్పందించాడు. తన పర్సనల్ విషయాలను, గతంలో ఆయన మీద వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మొదటి పెళ్లి, విడాకులు, రెండో వివాహాం మీద స్పందించాడు. తన ఇంట్లోని పరిస్థితుల గురించి ప్రకాష్ రాజ్ వివరించాడు. ప్రకాష్ రాయ్ నుంచి ప్రకాష్ రాయ్‌గా ఎవరు మార్చారు అన్న ప్రశ్నకు ప్రకాష్ రాజ్ గతాన్ని వివరించాడు. కే బాలచందర్ మార్చారు అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఓ సారి లక్ష్మీ గారు నీ పేరు ఏంటి అని అడిగారు. ప్రకాష్ రాయ్ అని చెప్పాను. గొప్ప నటుడివి అవుతావ్ అని అన్నారు. ఆ తరువాత కే బాలచందర్ గారు ప్రకాష్ రాజ్‌గా మార్చారు అని తెలిపాడు. మొదటి వివాహాం గురించి ప్రశ్నిస్తూ లతతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందని అలీ అడిగేశాడు. ఇద్దరం కలిసి ఉండలేమని అనుకున్నప్పుడు.. విడిపోయి సంతోషంగా ఉంటున్నామని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఇక పోనీ వర్మతో వివాహాం గురించి కూడా తెలిపాడు. ఇక ముందు నుంచి ముదురేనా? లేక ఇండస్ట్రీకి వచ్చాక ముదురులా? మారారా? అని అడిగాడు. బై డిఫాల్ట్ ముదురుగా పుట్టానంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. తన భార్యను ఎప్పుడైనా అన్నయ్య, రజినీకాంత్ దగ్గరికి తీసుకెళ్తే.. వీడితో ఎలా బతుకుతున్నావ్ తల్లి అని అంటుంటారని ప్రకాష్ రాజ్ తెలిపాడు. అలా మొత్తానికి ప్రకాష్ రాజ్ తన ఇంట్లో వాళ్తు తనను జోకర్‌లా చూస్తారని, పిల్లలు తన మాటలు వినరని, ఆర్డర్లు వేస్తుంటారని తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YkEHB6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...