Thursday, 21 October 2021

అలా చేస్తే చేతగాని వాడు అని అంటారు!.. అమ్మాయి ప్రశ్నకు నాగ శౌర్య దిమ్మతిరిగే జవాబు

రీతూ వర్మ జంటగా వస్తోన్న అనే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది వరకు వదిలిన పోస్టర్లు, పాటలు, టీజర్లు అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేశాయి.అయితే తాజాగా చేతుల మీదుగా వరుడు కావలెను ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయించింది. అయితే ఈ ఈవెంట్‌లో నాగ శౌర్య తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో కూల్‌గా సమాధానం ఇచ్చాడు. అందులో చాలా వరకు తన పర్సనల్ విషయాలపై స్పందించాడు. వరుడు కావలెను ట్రైలర్ వీక్షించిన తరువాత హీరోయిన్ కారెక్టర్ కాస్త టిపికల్‌గా అనిపించింది. అలాంటి అమ్మాయి మీ జీవితంలో వస్తే మీరేం చేస్తారు అని ఓ అమ్మాయి ప్రశ్న వేసింది. దానికి నాగ శౌర్య కౌంటర్ వేశాడు. లవర్‌గానా, భార్యగానా? అని రివర్స్ ప్రశ్న వేశాడు. అంటే మీరు మారిపోతాను అని నేరుగా చెప్పేస్తున్నారా? అని అడిగింది. అవును నేను మారిపోతాను అని అందరి ముందే ఒప్పేసుకున్నాడు. మీ జీవితంలో మిమల్ని డామినేట్ చేసే భార్య వస్తే ఏం చేస్తారు? అని మళ్లీ అడిగింది. సర్దుకు పోతాను అని ముందుగా నాగ శౌర్య బదులిస్తాడు. అంటే ప్రతీసారి మీరే తగ్గుతారా? అని మళ్లీ అడిగింది. ప్రతీసారి తగ్గను అలా తగ్గితే చేతకాని వాడని అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు తగ్గాలి అని నాగ శౌర్య బదులిచ్చాడు. అలా తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తొణక్కుండా సమాధానం ఇచ్చేశాడు. ఓ అమ్మాయి అయితే నేరుగా నాగ శౌర్యను హగ్గు ఇవ్వమని అడిగేసింది. దానికి ఓ క్షణం పాటు ఆలోచించి సరే రా అని అనేశాడు. ఇక ఆ అమ్మాయి తెగ సిగ్గుపడుతూ స్టేజ్ వద్దకు వెళ్లింది. నాగ శౌర్య వద్ద ఓ హగ్ తీసుకుని వెళ్లింది. మొత్తానికి నాగ శౌర్యకు ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి అందరికీ మరోసారి తెలిసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G8Gbjn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...