Monday, 4 October 2021

సాయి ధరమ్ తేజ్‌కు నాగచైతన్య విషెస్.. ‘ఇది చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ ఏంటీ అంటే.. ‘మా’ ఎన్నికలు, రోడ్డు ప్రమాదం, సమంత, నాగచైతన్య విడిపోవడం అనే చెప్పుకోవాలి. ఈ మూడు విషయాలకు సంబంధించి రోజుకో అప్‌డేట్ రావడం.. అది సెన్సేషనల్ కావడం వైరల్ అవుతోంది. ఇక కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాలపై పనిగట్టుకొని పుకార్లు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం, మరియు చై-సామ్ విడిపోవడంపై తరచూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ తన హెల్త్‌పై స్వయంగా అప్‌డేట్ ఇచ్చారు. తన రీసెంట్ సినిమా ‘’ని మంచి హిట్ చేసినందుకు ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని.. త్వరలోనే డిశ్చార్జి అని అందరికి క్లారిటి వచ్చేసింది. అయితే సాయి ధరమ్ తేజ్‌కు నాగచైతన్య కూడా మద్దతు తెలిపారు. సాయి ధరమ్ పెట్టిన ట్వీట్‌పై ఆయన కామెంట్ చేశారు. ‘ఇది చూడటం ఎంతో సంతోషంగా ఉంది తేజ్. బోలెడంత ప్రేమ’ అంటూ కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే నాగ చైతన్య.. విడాకులు జరిగినా తర్వాత కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగ చైతన్య రీసెంట్‌గా ‘లవ్‌స్టోరి’ సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాతో పాటు.. ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’, బాలీవుడ్‌లో ‘లాల్‌ సింగ్ చద్ధా’ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాల విడుదల గురించి కూడా త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సాయి ధరమ్ తేజ్‌కి నాగచైతన్య మద్దతు ఇవ్వడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఇలాగే మంచి వాతావరణం ఉండాలి అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uzJGdi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...