Wednesday, 6 October 2021

మరో అరుదైన ఘనత సాధించిన సమంత.. ఆ లిస్ట్‌లో మొదటి స్థానంలో కుందనపుబొమ్మ

‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి . తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సు దోచుకున్న ఆమె.. ఆ తర్వాత ఇటు తెలుగులో అటు తమిళంలో స్టార్ హీరోలతో నటించి.. తాను కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక అక్కినేని నాగచైతన్యతో తొలి సినిమాలో నటించిన ఆమె.. ఆయనతో ప్రేమలో పడింది. చాలాకాలం ప్రేమించుకున్న వీరిద్దరు.. 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే లవ్లీ కపుల్‌గా నిలిచిపోయారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరు కలిసి ‘మజలీ’ అనే సినిమాలో నటించారు. అయితే సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సోషల్‌మీడియాలో అత్యంత పాపులర్ హీరోయిన్ల జాబితాలో ఆమె కాజల్ అగర్వాల్‌ను వెనక్కు నెట్టి.. మొదటి స్థానంలో నిలిచింది. సమంత, కాజల్ తర్వాతి స్థానాల్లో రష్మిక, తమన్నా, కీర్తి సురేశ్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, సాయి పల్లవి నిలిచారు. అయితే కొద్ది రోజుల క్రితం సమంత, నాగ చైతన్యలు తమ వైవాహిక బంధానికి స్వస్థి పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చాలాకాలంగా వీరిద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తుండగా.. అంతా వాటిని రూమర్స్ అని భావించారు. కానీ, వీరిద్దరు అధికారికంగా విడాకులను ప్రకటించి.. అందరికి షాక్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’ అనే సినిమాలో నటిస్తుండగా.. సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో ‘’ అనే సినిమాలో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uLMYdk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...