Tuesday, 5 October 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: గోవా బీచ్‌లో పాయల్.. గౌన్‌లో సదా డ్యాన్స్‌లు.. క్రేజీ లుక్‌లో ఇలియానా

గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న పాయల్ ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ హాట్‌ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ప్రస్తుతం గోవాలో ఉన్న ఈ భామ.. తాజాగా ఓ హాట్ పిక్‌ని షేర్ చేసింది. ఉల్లిపోర లాంటి దుస్తుల్లో.. బీచ్‌లో అలా నిలుచొని పాయల్ దిగిన ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భర్తకు ముద్దు పెట్టి విషెస్ చెప్పిన అనసూయ యాంకర్, నటి ప్రస్తుతం షోలతో పాటు.. వరుస సినిమాలతో కూడా బిజీగా ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో సరదాగా గడుపుతుంది అనసూయ. తాజాగా తన భర్త పుట్టిన రోజు కావడంతో తన కొడుకులతో కలిసి.. ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ.. ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. గౌన్ వేసుకొని.. చిందులు వేసిన ‘జయం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన నటి సదా. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి ఆమె.. సినిమా అవకాశలు తగ్గిపోవడంతో పలు టీవీ షోలలో జడ్జిగా చేసింది. అయితే సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది సదా. తాజాగా ఓ చిన్న గౌను వేసుకొని.. డ్యాన్స్ చేస్తూ.. ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. వైట్ డ్రెస్‌లో సోనారిక గ్లామర్ ట్రీట్ ‘హరహర మహేదేవ్’ సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సోనారిక బడోరియా. ఇక తెలుగులో ‘ఈడో రకం.. ఆడో రకం’, ‘స్పీడున్నోడు’, ‘జాదూగాడు’ వంటి సినిమాల్లో నటించింది ఈ భామ. అయితే గత కొంతకాలంగా మాత్రం ఈ భామకు సినిమాలు లేవు. దీంతో సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువలో ఉంటుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ సుందరి. క్రేజీ లుక్‌లో లేటెస్ట్ పిక్ గోవా బ్యూటీ ఇలియానా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే.. ఈమె గ్లామర్ షో మరింత పెరిగిపోయింది. రీసెంట్‌గా ‘ది బిగ్‌బుల్’ అనే సినిమాలో కనిపించిన ఈ భామ.. పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా బ్లాక్‌ అండ్ వైట్ ఫిల్టర్‌లో ఓ ఫోటో దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FjMAYB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...