Sunday, 3 October 2021

పార్కులో సుడిగాలి సుధీర్- రష్మీ.. అందరిముందే రష్మీ కొంటె కామెంట్! రొమాంటిక్ కిక్కిచ్చిన లవ్ బర్డ్స్

సుడిగాలి సుధీర్- .. ఈ ఇద్దరిపై ఎన్ని రకాల వార్తలొచ్చినా అస్సలు బోర్ కొట్టదు. సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ గురించి ఎన్ని స్కిట్స్ చేసినా, వాళ్ళిద్దరికీ ఎన్ని సార్లు పెళ్లి చేసినా ఈ కిక్కులో ఉండే ఫ్రెష్‌నెస్ మాత్రం మాసిపోదు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రష్మీ- సుధీర్‌ల లవ్ ట్రాక్‌పై ఫోకస్ పెడుతుంటారు ఈవెంట్ నిర్వాహకులు. దీంతో టీవీ ఛానల్స్‌కి భారీ టీఆర్ఫీ దక్కడమే గాక సుడిగాలి సుధీర్- రష్మీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. జబర్దస్త్ సహా ఎన్నో షోస్ చేస్తూ రొమాంటిక్ కిక్కిస్తున్న ఈ ఇద్దరూ కలిసి ఢీ షోలోనూ రొమాన్స్ చేస్తుంటారు. సుధీర్- రష్మీకి తోడు హైపర్ ఆది- దీపిక పిల్లి ట్రాక్‌ను కూడా పెట్టి హైలైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వదిలిన ప్రోమోలో ఈ నలుగురు దుమ్ములేపేశారు. 'ఆర్య'లో అల్లు అర్జున్ స్టైల్లో చూపిన పర్ఫార్మెన్స్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. అంతేకాదు తన ప్రియురాలు రష్మీని పార్కుకు తీసుకెళ్లిన సుధీర్.. అక్కడ రొమాంటిక్ మూడ్‌లో రష్మీతో చేసిన సంభాషణ వైరల్ అవుతోంది. సైకిల్ మీద రష్మీ చుట్టూ చక్కర్లు కొట్టిన సుధీర్.. ఆ తర్వాత తన లోకి రొమాంటిక్ యాంగిల్ బయటకు తీస్తూ పార్క్‌కు తీసుకొచ్చా, తొమ్మిది దాటేసింది.. ఏంటి మరి? అని అడిగేశాడు. దీనిపై రష్మీ కూడా అంతే రొమాంటిక్‌గా ఏంటి మరి అని కొంటెగా అనడం హైలైట్ అయింది. ఇక దీపికతో ''ప్రేమించుకుందాం రా.. నేను ఎక్కితే నువ్ సైకిల్ తొక్కుతావో లేదో గానీ నువ్ ఎక్కితే మాత్రం నేను తొక్కుతాను'' అంటూ చేసిన కామెంట్స్ హీటు పుట్టిస్తున్నాయి. ఇలాంటి సన్నివేశాలతో ఈ ఢీ ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B5hm4X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...