Tuesday, 26 October 2021

ఒక్కటి కాబోతున్న ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ జోడీ! బీ- టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన మ్యారేజ్ మ్యాటర్

హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి సంగతుల గురించిన అప్‌డేట్స్‌కి సోషల్ మీడియాలో యమ డిమాండ్ ఉంటుంది. యంగ్ స్టార్స్ డేటింగ్ మ్యాటర్స్ తెలుసుకోవడానికి బాగా ఆసక్తి చూపుతుంటారు జనం. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆలియా భట్- లవ్ మ్యాటర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లికి సంబంధించి మరో న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ప్లేబాయ్‌గా పేరొందిన రణ్‌బీర్ కపూర్ గతంలో చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచారు. కానీ చివరకు స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తూ ఆమెనే పెళ్లాడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఈ స్టార్‌ జంట పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇరువురి ఫ్యాన్స్‌ని బీ- టౌన్‌లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త హుషారెత్తిస్తోంది. ఈ డిసెంబర్‌లోనే ఆలియా- రణ్‌బీర్‌లు ఒక్కటి కానున్నారని, వారి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. అక్కడి విలాసవంతమైన ఐకానిక్‌ ప్యాలెస్‌ హోటల్‌లో ఈ జోడీ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్ చేశారట. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుందని అంటున్నారు. ఇకపోతే ఇదే ఆలియా- రణ్‌బీర్‌ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు ఇటీవల ఓ జ్యోతిష్యుడు రణ్‌బీర్ కపూర్, అగ్నిసాక్షిగా ఒక్కటైతే వారి కెరీర్‌కి ఇక తిరిగులేనట్లే.. కానీ ఆలియా జాతక రీత్యా భర్తతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అని చెప్పడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mfkfLx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...