Tuesday, 26 October 2021

Akash Puri: ‘రొమాంటిక్‌’ న్యూ ట్రైలర్‌: అంచనాలు పెంచిన పూరి తనయుడు

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘రొమాంటిక్’. పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అక్టోబరు 29న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. రీసెంట్‌గా ప్రభాస్ చేతుల మీదుగా 'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తి రేకెత్తించారు. కర్లో యా మర్లో హీరో, హీరోయిన్స్ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుందో తెలిసేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ‘ బ్యాడ్‌ యాస్‌’గా విడుదలైన ఈ ట్రైలర్‌లో ఆకాశ్‌ పూరీ రోల్‌ గురించి కొన్ని సన్నివేశాలు చూపించారు. పుట్టింది పడుకోవడానికి కాదు. చనిపోయాక పడుకో’’ అంటూ ఆకాశ్‌ చెప్పే మాస్‌ డైలాగ్‌ స్పెషల్ అట్రాక్షన్ అయింది. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్ సినిమా వైపు అందరి దృష్టిని లాగేయగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ హైప్ పెంచేసింది. చూస్తుంటే ఈ సినిమాతో ఆకాష్ పూరి కెరీర్ టర్న్ కావడం పక్కా అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jzikQf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...