Thursday, 2 September 2021

Tollywood Drugs Case : ఇంత కంటే ఎక్కువ మాట్లాడలేను.. ఛార్మీ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇప్పటికే పూరి జగన్నాథ్‌ను ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారించింది. ఇక నేడు (సెప్టెంబర్ 2) ఛార్మీని కూడా విచారించింది. దాదాపు 8 గంటల పాటు ఛార్మీని ఈడీ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. ఇక గతంలో పోలీసులను ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. పోలీసులు అసభ్య ప్రవర్తించారంటే గతంలో ఛార్మీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ దెబ్బకు ఈ సారి ఛార్మీ కంటే ముందే లేడీ కానిస్టేబుళ్లను కూడా రంగంలోకి దించారట. అలా ఛార్మీ ఈడీ ముందుకు నేడు వచ్చింది. చార్మి విచారణ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. గురువారం విచారణకు హాజరైన చార్మిని సుమారు 8 గంటలకుపైగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఛార్మీ అక్కడి మీడియాతో సంభాషించింది. కేసు విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేనన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, లావాదేవీల వివరాలు అడిగితే డాక్యుమెంట్లు సమర్పించానని తెలిపారు. ఈడీ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇంత కంటే ఎక్కువ మాట్లాడడం సరికాదని చెప్పి వెళ్లిపోయారు. డ్రగ్స్ కేసుతోపాటు మనీ లాండరింగ్ కింద ఈడీ అధికారులు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక తదుపరి వంతు రకుల్ ప్రీత్ సింగ్‌దే. సెప్టెంబర్ 6న తాను హాజరు కాలేనని, వేరే తేదిలో వస్తాను అని రకుల్ చేసిన రిక్వెస్ట్‌ను ఈడీ అధికారులు పక్కన పడేశారట. సెప్టెంబర్ 6న కచ్చితంగా హాజరు కావాల్సిందేనని ఈడీ స్పష్టం చేసిందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n4H4lI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...