Thursday, 2 September 2021

HBD Pawan Kalyan : కొత్త ప్రాజెక్ట్ అప్డేట్.. పవర్ స్టార్‌తో సురేందర్ రెడ్డి

బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా వరుసగా సినిమా అప్డేట్లు వస్తున్నాయి. నేటి ఉదయం భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే అది సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక సాయంత్రం కూడా అప్డేట్ల మోత మోగనుంది. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నిర్మాతగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడిగా ఓ సినిమా రాబోతోంది. ఈ మేరకు తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. యథా కాలమ్ తథా వ్యవహారమ్ అనే పదాలను రాసి ఉన్న పోస్టర్‌ను వదిలారు. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకోబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకే ఎన్నో రూమర్లు వచ్చాయి. సైరా సినిమా తరువాత పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి ప్రయత్నాలు చేశారనే వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆ మధ్య రామ్ తాళ్లూరి సినిమా ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో అప్పుడే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు బయటకు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఉన్న ఈ బిజీలో డేట్స్ సర్దుబాటి చేసి ఇస్తారా? అనే అనుమానం ఇన్నాళ్లు ఉండేది. కానీ తాజాగా రామ్ తాళ్లూరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కాలాన్ని బట్టి పద్దతులు, వ్యవహారాలు మారుతాయనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రాబోతోన్నట్టు తెలుస్తోంది. వక్కంతం వంశీ అదిరిపోయే కథను రాయగా.. దాన్ని పవర్ స్టార్ శైలికి తగ్గట్టుగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ta3SSr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...