Saturday, 25 September 2021

‘ముందు వాళ్ల ముఖం చూసి నాపై కామెంట్ చేయండి’.. ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన నియా శర్మ

సోషల్‌మీడియాలో ఇప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్న ఇదే ఉపయోగపడుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి సంఘటన జరిగిన సోషల్‌మీడియా ద్వారా క్షణాల్లోనే అది అందరికి తెలిసిపోతుంది. ఇక సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య ఉండే దూరం పూర్తిగా తగ్గిపోయింది. సెలబ్రిటీలకు తమకు సంబంధించిన విషయాలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంటే.. అభిమానులు కామెంట్లు, మెసేజ్‌ల రూపంలో వారితో సంభాషిస్తున్నారు. అయితే ఇది ఒక విధంగా ఉపయోగకరంగా ఉంటే.. మరో విధంగా ఇబ్బందిపెడుతోంది. అదేంటంటే ట్రోలింగ్, బ్యాడ్ కామెంట్స్. ఈ ట్రోలింగ్ ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఎదురవుతోంది. ‘ఇలాంటి దుస్తులు వేసుకున్నావు ఏంటీ.. అలాంటి పాత్ర ఎందుకు చేశావు’ ఇలా అభిమానులు తమ అభిప్రాయాలను సెలబ్రిటీలపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు చాలా బాధపెట్టే విధంగా ఉంటాయి. అయితే ఇలాంటి కామెంట్స్‌ని కొందరు చూసి చూడనట్లు వదిలేస్తే.. కొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. హిందీ నటి కూడా తాజాగా అలాంటి పనే చేసింది. తాను అందంగా లేదని.. అందుకే తనకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటూ.. వచ్చిన ‘బాడీ షేమింగ్’ కామెంట్స్‌పై ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. తాను అందం లేనని.. వచ్చే కామెంట్లు చూడటం తనకు అలవాటు అయిపోయిందని చెప్పిన నియా.. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు ఒకసారి స్టార్ కిడ్స్‌ అని చెప్పుకొనే వాళ్ల ముఖాలు చూసి.. తర్వాత తనపై కామెంట్ చేయాలి అని పేర్కొంది. అప్పుడు ఎవరు అందంగా ఉన్నారో.. ఎవరు అందంగా లేరో తెలుస్తుందని ఆమె తెలిపింది. వాళ్లు తల్లిదండ్రుల పేరు పక్కన లేకపోతే.. ఆ ముఖాన్ని కూడా ఎవరు చూడరు అంటూ ఆమె మండిపడింది. స్టార్ కిడ్స్ కంటే తాను ఎంతో బెటర్ అని.. వాళ్లతో పోలిస్తే.. తాను అందగత్తెనే అని చెప్పింది. కాబట్టి ముందు వాళ్లపై కామెంట్ చేసి.. ఆపై తనపై కామెంట్ చేయాలి అంటూ తనపై వస్తున్న ట్రోల్స్‌కి ధీటుగా జవాబు ఇచ్చింది నియా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zHoItZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...