Saturday, 4 September 2021

ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిన బండ్లన్న.. త్వరలోనే అదిరిపోయే సర్‌ప్రైజ్..!

ఆయన ఒకప్పుడు హాస్య నటుడు. చాలా సినిమాల్లో చిన్న పాత్ర అయినా సరే ఆయన చేశారు. అయితే ఒక్కసారిగా ఆయన నిర్మాతగా మారిపోయారు. స్టార్ హీరోలతో కోట్లలో బడ్జెట్‌తో సినిమాలు తీసి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. దీంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పార్టీలోకి వెళ్లిన ఆయనకు కనీసం ఆ పార్టీ నుంచి టికెట్ కూడా లభించలేదు. దీంతో మళ్లీ సినిమాల బాటపట్టారు ఆయన. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది.. అవునండీ ఆయనే . ఎన్నో సినిమాల్లో హస్య నటుడిగా చేసిన ఆయన.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అంతగా కలిసి రాలేదు. దీంతో గత ఏడాది అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై అడుగుపెట్టారు. అయితే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన బండ్ల.. పవన్‌ సినిమా వేడుకల్లో ఇచ్చే స్పీచ్‌లకు ఉండే క్రేజ్ వేరు. రీసెంట్‌గా వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఎంతో వైరల్ అయింది. అంతేకాదు.. దానిపై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తన ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు బండ్ల రెడీ అవుతున్నారు. అదేంటో కాదు.. ఆయన తొలిసారిగా హీరోగా ఓ సినిమా చేస్తున్నారనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. తమిళ హిట్ ‘’ సినిమా తెలుగు రీమేక్‌లో ఆయన హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్టిల్‌ని ట్వీట్ చేశారు బండ్ల.. తను తెలుగులో చేస్తున్న పాత్రను హిందీతో అభిషేక్ బచ్చన్ పోషిస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం బండ్ల గణేష్ మేక్ ఓవర్‌ అయ్యారు అని.. నాన్‌స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ వస్తుందని.. అది ఈ సినిమా ఫస్ట్‌లుక్ అని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yIc511
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...