Thursday, 30 September 2021

అమీర్ ఖాన్ సెంటిమెంట్‌కు అనుకోని బ్రేక్.. ఆ కారణంగానే ‘లాల్ సింగ్ చద్ధా’ వాయిదా..

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు అంటేనే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాలో ఆయనకు ఇచ్చిన పాత్రకి తగినట్లు కనిపించేందుకు ఆయన ఎలాంటి సాహసం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఒక సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చేస్తారు.. మరోసారి పొట్ట పెంచేస్తారు. ఇలా ఆయన సినిమా కోసం పడే కష్టం చూసే ఆయన్ను మిస్టర్ పర్‌ఫెక్ట్ అని అభిమానులు పిలుస్తారు. అయితే అమీర్ ఖాన్‌ను హీరోగా వెండితెరపై చూసి చాలాకాలమే అయింది. దీంతో ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన అద్వైత్ చందన్ దర్శకత్వంలో నటిస్తున్న కామెడీ డ్రామా చిత్రం ‘’. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 1994లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగ చైతన్య ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని అప్‌డేట్స్, వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటివరకూ మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోలేదు. అయితే పరిస్థితులు మెరుగుకావడంతో వచ్చే నెల నుంచి థియేటర్లను తెరుస్తున్నట్లు మహా సర్కారు ప్రకటించింది. అయితే తొలుత ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అమీర్ ఖాన్‌ సెంటిమెంట్ కూడా కావడంతో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘83’, ‘జెర్సీ’, ‘సర్కస్’ వంటి సినిమాలు విడుదల అవుతుండటంతో.. తమ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుక విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నిర్మాతల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CTevMS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...