Monday, 6 September 2021

అదరగొట్టేశారు..! మహా సముద్రం పాటకు ఫిదా అయిన రష్మిక మందన.. వీడియో వైరల్

శ‌ర్వానంద్‌, హీరోలుగా Rx 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ''. రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. , సిద్దార్ధ్‌, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా జగపతి బాబు, రావు ర‌మేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ''హే రంభ'' సాంగ్ ప్రేక్షకాదరణ పొందగా.. తాజాగా ''చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు..'' అంటూ సాగే ప్రేమ పాటను రిలీజ్ చేశారు. క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ సాంగ్ రిలీజ్ చేయడం విశేషం. ఈ మేరకు మహా సముద్రం పాటకు తాను ఫిదా అయినట్లు పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సాంగ్ పోస్ట్ చేసింది రష్మిక. దీంతో ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే వైరల్ అయింది. ఇటీవల శర్వా తనకు సినిమా ట్రైలర్‌ కూడా చూపించారని, అందరూ అదరగొట్టేశారని రష్మిక తెలిపింది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WToH8D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...