Tuesday, 28 September 2021

‘నువ్వు ఆ ప్రామిస్ చేస్తేనే.. నీ పక్కన ఉంటాను’.. పూరి జగన్నాథ్‌కు విజయ్ విషెస్

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా.. సినిమాలు తీయడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో విధమైన స్టైల్ ఉంటుంది. కొందరు మాస్ సినిమాలు తీయడంతో ప్రావీణ్యం పొందితే.. మరికొందరు మంచి క్లాస్ సినిమాలు తీస్తుంటారు. ఇంకొందరు కామెడీ సినిమాలు తీయడంటో ఎక్స్‌పర్ట్‌గా ఉంటారు. అయితే తెలుగు ఇండస్ట్రీ దర్శకుల లిస్ట్ తీస్తే.. అందులో విలక్షణ దర్శకుడు ఎవరు అంటే అంతా పేరే చెబుతారు. ఇతర దర్శకులతో పోలిస్తే.. పూరి తెరకెక్కించే సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఉండే హీరోయిజం.. వేరే లెవల్‌లో ఉంటుంది. ఓ డిఫరెంట్ స్టైల్‌లో హీరో పాత్రని ఎలివేట్ చేయడంలో పూరి ఎప్పుడో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇకపోతే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఆయన రౌడీ హిరో విజయ్ దేవరకొండతో కలిసి ‘’ సినిమా తెరకెక్కిస్తున్నారు. కిక్ బాక్సింగ్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాక్సర్ ‘మైక్‌ టైసన్’ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కాగా, మంగళవారం పూరి జగన్నాథ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నటీనటులు, ఇతర టెక్నీషిన్లు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కూడా తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘రెండు సంవత్సరాల క్రితం మన ఇద్దరం కలుసుకోవడం విధి నిర్ణయం. నటుడిగా నాకు అతి పెద్ద వేదికను ఇచ్చిన దర్శకుడిగా నువ్వు మారావు. నా సంతోషంలో, బాధలో నమ్మే మిత్రుడివి నువ్వు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా రక్షకుడివి నువ్వు. వచ్చే ఏడాది మన ఇద్దరం కలిసి వచ్చే సంవత్సరం ప్రపంచం మర్చిపోలేని కానుక ఇద్దాము. ఐ లవ్‌ యూ సార్. మీరు ఆరోగ్యంగా ఉంటాను అని ప్రామిస్ చేస్తే.. నేను మీ పక్కనే ఉంటూ.. అదరగొడతాను’ అంటూ విజయ్ ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ie3NsA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...