Sunday, 5 September 2021

‘నీ జన్మదినం.. నా పునర్జన్మం’.. ప్రేయసిపై కవిత రాసిన యంగ్ హీరో నవీన్

'పెళ్లి చూపులు' సినిమాలో అభయ్‌గా నటించిన ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస పాత్రలతో బిజీ అయిపోయాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అతను అలరిస్తూ వస్తున్నాడు. ఇక నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు అతను. ‘రమణ యూత్’ అనే సినిమాతో త్వరలోనే దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే నవీన్ తాజాగా తన ప్రేయసి కోసం ఓ కవిత రాశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ కవిత్వంతో పాటు ఫోటోని కూడా పోస్ట్ చేశారు. అవునండీ.. అయితే ఆమె నిజ జీవితంలో ప్రేయసి కాదు.. సినిమా ప్రేయసి నవీన్ బేతిగంటి హీరోగా, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని ఈ మధ్య చిన్నచిన్న పాత్రలు వేస్తూ వస్తున్న నటి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘’. సినిమా బ్యాక్ డ్రాప్ పెళ్లి అయిన భార్య భర్తల మధ్య ఉండే ఘర్షణ, సంతోషం, బాధ లాంటి ఎలిమెంట్స్‌ని ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా దివ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె లుక్‌ని విడుదల చేశారు హీరో నవీన్. ఇందులో ఆమె నిండుగా చీరకట్టుకొని చూడముచ్చటగా మనకు కనిపిస్తోంది. ‘నా మాటల జతగా, నీ అడుగులు సాగాలని.. నా కలల అలలుగా, నీ తీరం చేరాలని ఆశిస్తూ.. నీ జన్మదినం.. నా పునర్జన్మం - నీ చక్రవర్తి’ అంటూ నవీన్ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చి దివ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజిని రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుంగా.. స్త్రీలంక చందు సాయి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అబు ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర తారాగణం గురించి త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YkVeVA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...