Wednesday, 1 September 2021

మరో కొత్త అమ్మాయితో ఆది సాయికుమార్.. అమె గట్టిగా వాటేసుకున్న యువ హీరో..

‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు నటుడు ఆది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో కొన్ని రొటీన్ సినిమాలు చేసి.. వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకున్న ఆయన.. ఆ తర్వాత తన స్టైల్ మార్చుకున్నాడు. డిఫెరెంట్ జోనర్‌లో సినిమాలు చేసి.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. అయితే రీసెంట్‌గా ‘శశి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఆది. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. ఇక కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు ఆది. ఇప్పటికే 'అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1'అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఎస్.బాలవీర్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌వీఆర్ నిర్మిస్తున్నారు. అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆది ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఆయన మరో విలక్షణమైన సినిమా చేస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆయన ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ యువ హీరో, హీరోయిన్‌ వాటేసుకొని ఉండగా.. హీరో ఆది.. అందులోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా ‘’ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kOO1VE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...