Sunday, 5 September 2021

Bigg Boss 4 Sohel: ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ షాకిచ్చిన బిగ్‌బాస్ స్టార్ సోహైల్‌

తెలుగు రియాలిటీ షోలో నాలుగో సీజ‌న్‌లో పార్టిసిపెంట్స్ మిగ‌తా సీజ‌న్స్ వారికంటే ముందంజ‌లో ఉన్నారు. అది క్రేజ్‌లో అయినా కావ‌చ్చు, అవ‌కాశాల‌ను అందుకోవ‌డంలో అయినా కావ‌చ్చు. అలా ఆడియెన్స్‌లో క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఒక‌డు. ఫైన‌ల్స్ వ‌ర‌కు వెళ్లిన సోహైల్ ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టిస్తుండటం విశేషం. లేటెస్ట్‌గా సోహైల్ న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌’. సాధార‌ణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఇందులో మ‌న హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావ‌డ‌మే షాకింగ్ విష‌యం. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేలా టీజ‌ర్‌, పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇప్పుడ‌వి సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కారులో నుంచి దిగిన సోహైల్ విలన్స్‌ను చిత‌క్కొట్టి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. వెల్ క‌మ్ టు ది న్యూ వ‌రల్డ్ బేబి అంటూ చెప్పే డైలాగ్‌తో పాటు నెల‌ల క‌డుపుతో ఉన్న సోహైల్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అస‌లు సినిమా క‌థ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. శ్రీనివాస్ వింజంపాటి ద‌ర్శ‌క‌త్వంలో అప్పిరెడ్డి, ర‌విరెడ్డి స‌జ్జ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ గ్లింప్స్ చూస్తుంటే కామెడీ చిత్ర‌మే కాదు, ఏదో ఎక్స్‌పెరిమెంట్ మూవీలా కూడా అనిపిస్తుంది. మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుసుకోవాల‌నే ఉద్దేశంతో కాకుండా వైవిధ్య‌మైన సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకుని, మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ వంటి ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో సినిమా చేస్తున్న సోహైల్ నిజంగా అభినంద‌నీయుడే. రూపా కొడువాయుర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో అంద‌రి కంటే సోహైల్ అవ‌కాశాల‌ను అందుకోవ‌డంలో ఓ అడుగు ముందే ఉన్నాడు. బిగ్‌బాస్‌లో త‌న‌కు వ‌చ్చిన క్రేజ్‌ను కూడా నిర్మాత‌లు ఉప‌యోగించుకోవాల‌నుకోవడం బాగానే క‌లిసొస్తుంది సోహైల్‌కి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DRA95p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...