Friday, 3 September 2021

Akhanda: బాలయ్య ఫ్యాన్స్‌కి త్వరలోనే గుడ్‌స్యూస్.. అప్‌డేట్ వచ్చేది ఎప్పుడంటే..?

బాలకృష్ణ.. కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ.. ఓ టీజర్‌ని వదిలారు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కోస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ చెప్పిన ఒకేఒక్క డైలాగ్ అభిమానులకు ఆకట్టుకుంది. ఈ టీజర్‌ కంటే ముందే సినిమా టైటిల్ ప్రకటించకుండా ‘బీబీ3’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌కు ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించింది. ఈ రెండు మినహా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏమీ రాలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే అఖండ నుంచి అప్‌డేట్ వస్తుంది అంటూ సినిమా నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్‌ ఓ ట్వీట్ చేసింది. దీంతో పాటు ఓ త్రిశూలం పిక్‌ని జత చేసింది. అయితే ఆ అప్‌డేట్ వచ్చేది ఎప్పుడా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలేదు. తాజాగా ఈ వారాంతంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక అప్‌డే వస్తుందనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ అప్‌డేట్ ఫస్ట్ సింగిల్ గురించా.. లేక రిలీజ్ డేట్ గురించా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ విషయంపై స్పష్టత రావాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని సమాచారం. ఒక ప్రతినాయకుడి పాత్రలో కూడా ఓ టాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zISdMO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...