Saturday, 25 September 2021

కేరవ్యాన్‌లోనే కానిచ్చేస్తోన్న ఆర్ ఎక్స్ 100 బ్యూటీ.. పాయల్ దెబ్బకు అంతా ఫిదా!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అంతలా రెచ్చిపోయి నటించడం, హద్దుల్లేకుండా అందాలను ఆరబోయడంతో యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇందు పాత్రలో పాయల్ చేసిన నటనకు అందరూ షాక్ అయ్యారు. ఆ ఒక్క చిత్రంతోనే పాయల్‌కు ఊపిరి ఆడనన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. ఇంకా కొన్ని సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. కానీ కరోనా వల్ల వాయిదా పడ్డాయి. అయితే ఇందులో పాయల్ సినిమా ఓటీటీలోనూ వచ్చింది. అలా పాయల్ ఓటీటీ, వెండితెర అనే సంబంధం లేకుండా దూసుకుపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే పాయల్‌కు ఉన్న క్రేజ్ వేరు. పాయల్ చేసే అందాల విందుకు అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పొట్టి బట్టల్లో పాయల్ చేసే ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక పాయల్‌పై ఎక్కువగా నెట్టింట్లో ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. ఆ మధ్య కరోనా టెస్టుల సమయంలో అతిగా భయపడిందని, అతి చేసిందంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనకు చిన్నతనం నుంచి సూదులు, ఇంజక్షన్‌లన్నా భయమని క్లారిటీ ఇచ్చింది. దానికే మీరు అంతలా ట్రోల్ చేస్తారా? అని విరుచుకుపడింది. అయితే తాజాగా పాయల్ ఏదో తన సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో వానిటీ (కేరవ్యాన్)లోనే వంట వండేసింది. తన చుట్టుపక్కల ఉన్న వారికి ఆలూ పరోటాను చేసి పెట్టింది. దీంతో అందరూ ఆ బ్యూటీ చేతివంటకు ఫిదా అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y13v1h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...