Monday, 30 August 2021

Trisha: చిరుతో కష్టం బాలయ్యతో ఓకే..! హాట్ టాపిక్ అయిన త్రిష డిసీజన్

ఒకానొక సమయంలో తెలుగు తెరపై హవా నడిపించిన .. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా అంటోంది. తెలుగు తెరపై చాలా అరుదుగా కనిపిస్తున్న ఈ అమ్మడు ఇటీవల చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందని విన్నాం. అందుకు కారణాలేంటనేవి పక్కనబెడితే ఇప్పుడు సరసన నటించేందుకు ఆమె రెడీ అయిందని తెలుస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత తదుపరి సినిమాను 'క్రాక్' ఫేం దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న డైరెక్టర్.. హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్యతో సినిమా అనగానే త్రిష వెంటనే ఓకే చేసిందని, ఇందులో ఆమె గృహిణిగా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు త్రిష రెడీ అయ్యిందనే విషయం బయటకు రావడంతో ఆమె తీసుకున్న ఈ డిసీజన్‌పై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. చిరంజీవితో ఛాన్స్ వచ్చినా వదులుకుంది కానీ బాలకృష్ణతో మాత్రం రెడీ అనడంలో రీజన్ ఏమై ఉంటుందా అని వెతికే పనిలో పడ్డారు జనం. ఏది ఏమైనా నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య- త్రిష కాంబినేషన్‌ని వెండితెరపై చూడబోతున్నామని తెలిసి ఖుషీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ ఘటన నేపథ్యంలో కథ రాసుకున్నారట గోపీచంద్. ఇందులో బాలయ్యతో పాటు మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ తారల వైపు చూస్తున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BkSea0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...