Friday, 27 August 2021

Sudheer babu: ప్రభాస్‌‌తో రాత్రంతా అలా..! ఆ రోజు ట్యాంక్‌బండ్‌ వద్ద అర్ధరాత్రి సమయంలో మేమిద్దరం..

నేటితరం హీరోలు ఒకరితో మరొకరు ఎంతో స్నేహంగా మెదులుతుండటం చూస్తున్నాం. సినీ జీవితం పక్కనబెడితే పర్సనల్ లైఫ్‌లో అంతా కలిసి ఎంజాయ్ చేస్తుండటం, వీలు కుదిరినప్పుడల్లా మీట్ అవుతూ పార్టీలు చేసుకుంటూ ఉండటం జరుగుతోంది. దీంతో హీరోల మధ్య ఉన్న ఆ స్నేహబంధాన్ని తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్విట్టర్‌లో చాట్ చేసిన .. ప్రభాస్‌తో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. '' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా కాసేపు ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు సుధీర్ బాబు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్ వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. తనకి మంచి మిత్రుడని చెప్పారు. ప్రభాస్‌తో కలిసి ట్యాండ్‌బండ్‌ రోడ్లపై రాత్రంతా చక్కర్లు కొట్టేవాడినని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. అలాగే తమ మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెప్పిన సుధీర్ బాబు.. 'వర్షం' సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను తెలిపారు. 'వర్షం' సినిమా విడుదలయ్యాక ఆ సినిమా కటౌట్‌ చూడడం కోసం ప్రభాస్‌, దేవి శ్రీ ప్రసాద్‌‌లతో కలిసి అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని థియేటర్ల వద్దకు చేరుకున్నామని.. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌కు చేరుకుని రాత్రంతా ‘వర్షం’ పాటలు పాడుకుంటూ అక్కడే గడిపామని అన్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా విషయానికొస్తే.. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుధీర్‌ బాబుకు జోడీగా ఆనంది నటించింది. మణిశర్మ బాణీలు కట్టారు. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BeDSYM
v

No comments:

Post a Comment