Wednesday, 11 August 2021

లగ్జరీ కారులో ఎన్టీఆర్, రామ్ చరణ్.. అలా ఎంజాయ్ చేస్తున్న స్టార్స్! RRR ఇంట్రెస్టింగ్ వీడియో

దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ RRR. యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట కోసం ఉక్రెయిన్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటతో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఈ నేపథ్యంలో సర్‌ప్రైజింగ్ వీడియోలతో ఆకట్టుకుంటూ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తోంది యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఓ వీడియో వదలడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లగ్జరీ కారులో ప్రయాణిస్తూ.. రీసెంట్‌గా విడుదలైన 'దోస్తీ' సాంగ్‌‌‌‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలా ఇద్దరు హీరోలను ఎంజాయ్ మోడ్‌లో పక్కపక్కనే చూసి ఖుషీ అవుతున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్. మరోవైపు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా రిలీజైన దోస్తీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కీరవాణి బాణీలు సంగీత ప్రియులను ఓ రేంజ్‌లో ఆకర్షిస్తున్నాయి. దీంతో 5 భాషల్లో కూడా ఈ సాంగ్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. విజువల్ వండర్‌లా ఉండేలా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రీయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు రాజమౌళి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xCw54P
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...