Sunday, 29 August 2021

PV Sindhu హైట్ మీద ‘చిరు’ హాస్యం.. రానా ఎంట్రీతో ‘మెగా’ సెటైర్లు!

మెగాస్టార్ చిరంజీవిలోని చతురత గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై ఎంత చమత్కారంగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే ఉంటారు. ఇక ఆ మధ్య ట్విట్టర్‌లో ఆయన దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక్కొక్కరి మీద ఆయన వేసిన పంచ్‌లు, వేసిన మీమ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఒలింపిక్ పతకాన్ని సాధించిన పీవీ సింధును అందరి సమక్షంలో సత్కరించారు. దీనికి సంబంధించి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను తన ఇంట్లోనే ఏర్పాటు చేశారు చిరంజీవి. పీవీ సింధును సత్కరించే ఈ కార్యక్రమానికి చిరంజీవి తన బంధుమిత్రులందరినీ పిలిచారు. ఇండస్ట్రీ నుంచి దాదాపు తన స్నేహితులందరినీ పిలిచారు. నాగార్జున, సుహాసిని, రాధిక ఇలా అందరినీ ఆహ్వానించారు. ఇక అల్లు అరవింద్ ఎలాగూ ఉంటారు. రామ్ చరణ్ తన ఫ్రెండ్స్‌ను పిలుచుకున్నట్టున్నారు. శర్వానంద్, , అఖిల్ ఇలా అందరూ కూడా ఆ పార్టీలో కనిపించారు. అయితే తాజాగా చిరంజీవి పీవీ సింధును సత్కరించిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అందులో ఓ చోట హైట్ మీద చిరు కామెంట్ వేశారు. అసలే సింధు చిరంజీవి కంటే ఎంతో ఎత్తు ఉంటుంది. మామూలుగా ఆమె పక్కన ఎవ్వరూ నిల్చున్నా కూడా పొట్టిగానే కనిపిస్తుంటారు. కానీ రానా ఎంట్రీతో చిరుకు ధైర్యం వచ్చినట్టుంది. నీ హైట్‌కు తగ్గవాడు ఇప్పుడు వచ్చాడు అంటూ రానాను చూపిస్తూ సింధు మీద సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DlUHTz
v

No comments:

Post a Comment