Monday, 2 August 2021

Pushpa First Single : దాక్కో దాక్కో మేక.. దుమ్ములేపనున్న దేవీ!

రాక్ స్టార్ బర్త్ డే సందర్బంగా అప్డేట్ రాబోతోందనే రూమర్లు నిజమయ్యాయి. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఐదు భాషల్లో రాబోతోన్న ఈ పాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. హిందీ, తమిళ, తెలుగు, మళయాల, కన్నడ భాషల్లో ఈ పాటను ఆగస్ట్ 13న విడుదల చేయబోతన్నట్టు తెలిపారు. పుష్ప ఫస్ట్ సింగిల్ అంటూ దాక్కో దాక్కో మేక.. అంటూ దుమ్ములేపేందుకు దేవీ శ్రీ ప్రసాద్ రెడీ అయ్యారు. నేటి ఉదయం నుంచి దేవీ శ్రీ ప్రసాద్ బర్త్ డేతో పాటుగా పుష్ప ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూనే వచ్చింది. అలా ఈ రోజు కచ్చితంగా పుష్ప పాటల గురించి అప్డేట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయ్యారు. ఉదయం నుంచి పుష్ప, తగ్గ్యేదేలా, హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూనే వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. విశాల్ దద్లానీ హిందీలో, తెలుగులో శివం, తమిళంలో బెన్నీ, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్ ఈ పాటను ఆలపించున్నారు. దాక్కో దాక్కో మేక అంటూ ఈ పాట ఆగస్ట్ 13న రాబోతోంది. హ్యాపీ బర్త్ డే మై డియర్ దేవీ.. పుష్ప కోసం నువ్ కంపోజ్ చేసిన ఈ సంగీతం ప్రపంచమంతా చూడాలి.. ఆసమయం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మళ్లీ నీ సంగీతంతో ప్రేమలో పడిపోయాను. ఇలానే మ్యాజిక్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని దేవీ శ్రీ ప్రసాద్‌పై బన్నీ పోస్ట్ వేశారు. ఇక బన్నీ పోస్ట్‌కు దేవీ స్పందిస్తూ.. నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నాను.. సుక్కు భాయ్,నువ్ కలిసి చేసిన ఈ అద్భుతాన్ని ప్రపంచం చూడాలని నేను కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zUP4Jk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...