Thursday, 26 August 2021

Pawan Kalyan సినిమాలో క్రేజీ బ్యూటీ.. పక్కా ప్లాన్ చేసిన హరీష్ శంకర్! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్

అటు రాజకీయం, ఇటు సినిమా.. రెండు దారుల్లో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'వకీల్ సాబ్' సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ''భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు'' సినిమాల తర్వాత దర్శకత్వంలో ఆయన మరో సినిమా సెట్స్ మీదకు రానుంది. గతంలో 'గబ్బర్ సింగ్' సినిమాతో భారీ హిట్ సాధించిన ఈ కాంబో మరో భారీ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ముందస్తు పనులు చూసుకుంటున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ క్రమంలోనే పవన్‌తో సరితూగే హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన ఆయన మొదట కియారా అద్వానీ పేరును పరిశీలనలోకి తీసుకున్నారని విన్నాం. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు పవన్ కళ్యాణ్‌‌తో రొమాన్స్ చేసేందుకు పూజా హెగ్డేను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజా.. పవన్‌తో సినిమా అనగానే వెంటనే ఓకే చేసిందట. దీంతో ఆమె డేట్స్ తీసుకొని అందుకు తగ్గట్లుగా అన్నీ పక్కగా ప్లాన్ చేస్తున్నారట హరీష్. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో కథ రాసుకున్న హరీష్ శంకర్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. పవన్ రాజకీయ జీవితానికి ప్లస్ అయ్యేలా పదునైన డైలాగ్స్ రాసి పెట్టారట. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. పవన్ కళ్యాణ్‌కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని కాబట్టి పవర్ స్టార్ సెకండ్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగిన సినిమాగా ఈ మూవీ నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. సో.. చూడాలి మరి పవన్‌తో ఎంత పకడ్బందీగా హరీష్ శంకర్ బరిలోకి దిగుతారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bk3dQS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...