Wednesday, 25 August 2021

Maestro : అలాంటి పాత్రతో రంగప్రవేశం!.. మంగ్లీ కొత్త అవతారంపై నెటిజన్ల కామెంట్లు

పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పుట్టింది సీమలో అయినా కూడా పేరు వచ్చింది మాత్రం తెలంగాణలో. తెలంగాణ యాస, భాషను ఒడిసిపట్టుకున్న మంగ్లీ తన గాత్రంతో ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. మంగ్లీ పాడే ప్రతీ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతుంటుంది. ఇక ఈ మధ్య ఓ భక్తి పాట వివాదంగా మారడంతో మంగ్లీ పేరు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కింది. అయితే మంగ్లీ మాత్రం ఆ వివాదాన్ని ఎంతో తెలివిగా తిప్పి కొట్టేశారు. ఎవ్వరినీ నొప్పించకుండా పాటలోని లిరిక్స్‌ను మార్చేశారు. అలా చివరకు మంగ్లీ ఆ వివాదానికి స్వస్తి పలికారు. అయితే మంగ్లీ చేసే కవర్ సాంగ్స్ నెట్టింట్లో ఎంతో వైరల్ అవుతుంటాయి. బుల్లితెరపైనా మంగ్లీ హల్చల్ చేస్తుంటారు. పండుగ స్పెషల్ ఈవెంట్లకు మంగ్లీ చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి మంగ్లీ ఇప్పుడు నటిగా కొత్త అవతారాన్ని ఎత్తేశారు. ఇప్పటికే యూట్యూబ్‌లో స్పెషల్ ఆల్బమ్స్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న.. మంగ్లీ ఇప్పుడు నటిగానూ మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. అంధాదున్ సినిమాకు రీమక్‌గా నితిన్ రాబోతోంది. ఇందులో ఆటోవాలాకు సంబంధి అదిరిపోయే సీన్లు ఉంటాయి. ఆ పాత్రతో సినిమాలో కీలక మలుపు జరుగుతుంది. నితిన్‌ను మోసం చేసే ఆ పాత్రలో మంగ్లీ నటిస్తున్నారు. మొత్తానికి ఆ పాత్ర మంగ్లీకి ఏ మేరకు అవకాశాలు తీసుకువస్తుందో చూడాలి. మాస్ట్రో ట్రైలర్‌లో అలా ఒక్క క్షణం మెరిసిన మంగ్లీని జనాలు గుర్తు పడుతున్నారు. ఆమెకు విషెస్ చెబుతున్నారు. మొత్తానికి మంగ్లీ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన ముద్రను వేసేందుకు రెడీ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gy7AjD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...