Friday, 13 August 2021

KGF- 2కి భారీ ఆఫర్స్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫైనల్ డిసీషన్.. అదే ఫిక్స్ అనేశారట!

KGF Chapter 2: ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సినిమాల హావా బాగా పెరిగింది. 'బాహుబలి' సినిమాతో తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలియడంతో టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్-1 ఊహించని సక్సెస్ సాధించింది. కన్నడ స్టార్ నటనకు ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించారు. దీంతో అంతకుమించి అన్నట్లుగా కేజీఎఫ్ చాప్టర్-2 రూపొందుతోంది. ఈ సినిమా కోసం యావత్ భారతదేశంలోని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు బయటకొస్తున్న KGF- 2 అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. దీంతో షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇది గమనించిన ట్రేడ్ వర్గాలు భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా రైట్స్ తీసుకునేందుకు ముందుకొచ్చారని సమాచారం. ఓటీటీ సంస్థలకు ఈ సినిమాపై గట్టిగానే నమ్మకం ఏర్పడటంతో షాకింగ్ ఆఫర్స్ ఇస్తున్నారట. సినిమా కోసం దాదాపు 600 కోట్ల వరకు ఓటీటీ ఆఫర్స్ వచ్చినట్లు టాక్. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ మూవీని ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ భావించి.. హక్కులకోసం గట్టిగానే పోరాడినట్లు సమాచారం. అయితే ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేయాలని డైరెక్టర్ తన నిర్మాతలతో చెప్పారట. KGF- 2 సినిమాను ఎలాగైనా థియేటర్స్‌లో రిలీజ్ చేసి బాక్సాఫీస్ సునామీ సృష్టించాలని ఆయన బలంగా ఫిక్సయ్యారట. నిజానికి ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది చివరలోనే ఎలాగైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, సీనియర్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ కీల‌క పాత్ర‌ పోషిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xNtNQm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...