Thursday, 26 August 2021

Jr NTR : ఇదేం స్పీడ్ రా బాబోయ్.. వాయు వేగంతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీడియో వైరల్

టీం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. షూటింగ్ మొత్తం పూర్తయిందని, అక్కడక్కడా చిన్న చిన్న వర్క్స్ తప్పా మొత్తం పూర్తయిందని చెప్పుకొచ్చారు. మొదటి రోజు ఏ షాట్‌తో అయితే ప్రారంభించారో.. చివరగా అదే షాట్‌తో క్లోజ్ చేశామని చెప్పుకొచ్చింది చిత్రయూనిట్. ఇదంతా ఒకెత్తు అయితే చివర్లో టీం ఓ వీడియోను షేర్ చేసింది. అది చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మన హీరోలిద్దరూ కూడా వాయువేగంతో నువ్వానేనా అన్నట్టుగా కారులో దూసుకెళ్లిపోయారు. అసలే మన హీరోల కార్ల రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. మొన్నీ మధ్యే యంగ్ టైగర్ లంభోర్గిని కారు కొనేశారు. ఇక వద్ద కూడా లగ్జరీ కార్లున్నాయి. ఇలా ఈ హీరోలు ఇద్దరూ కూడా నేడు షూటింగ్ ముగిసిన తరువాత అందరికీ షాక్ ఇచ్చారు. సెట్ నుంచి జెట్ స్పీడ్ వేగంతో వెళ్లిపోయారు. అక్కడ ఉన్న వారంతా వారి వేగాన్ని చూసి షాక్అయ్యారు. టైగర్ అండ్ చీతా అంటూ ఆర్ఆర్ఆర్ టీం ఆ వీడియోను షేర్ చేసింది. అందులో నిజంగానే పులి, చిరుత పులిలా ఇద్దరూ దూసుకెళ్లిపోయారు. క్షణంలోనే కనిపించి మాయమైపోయారు. ఆ వేగాన్ని చూసి అక్కడి వారంతా నోరెళ్లబెట్టేశారు. అయితే ఈ మితి మీరిన వేగం మాత్రం ప్రమాదానికి కారణం అయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీం మాత్రం షూటింగ్ అప్డేట్ ఇచ్చేశారు. ఇక త్వరలోనే అప్డేట్ల వర్షం కురుస్తుందని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WorjuL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...