Sunday, 15 August 2021

Indian Idol 12 విన్నర్ పవన్‌ దీప్ రాజన్.. తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు ఘోర పరాభవం!!

పాపులర్‌ మ్యూజికల్‌ రియాలిటీ షో ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ఈ పాపులర్ మ్యూజిక్ షో సీజన్ 12 విజేతగా నిలిచారు. స్టార్ సింగర్లు, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి ప్రముఖుల తళుకుల మధ్య ఈ షో ఆద్యంతం సందడిగా సాగింది. అంతా ఊహించినట్లుగానే ఈ సీజన్ టైటిల్ పవన్‌ దీప్ రాజన్ గెలుచుకున్నాడు. ఫైనల్ పోటీలో టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన గ్రాండ్ ఫినాలే అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సాగగా.. పవన్‌దీప్ రాజన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. టైటిల్ విన్నర్‌కి 25 లక్షల చెక్‌తో పాటు ట్రోఫీ, ఓ కారు కూడా లభించాయి. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌ నిలవగా.. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియకు ఘోర పరాభవం ఎదురైంది. ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌కు ఆదిత్య నారాయణ్ హోస్ట్‌గా, హిమేశ్ రేష్మియా, అనుమాలిక్, సోను కక్కర్ జడ్జ్‌లుగా వ్యవహరించగా.. గెస్ట్ హోదాలో జావెద్ అలీ, సుఖ్విందర్ సింగ్, సాధన సర్గమ్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, ఉదిత్ నారాయణ్, అల్కా యాజ్ఞిక్ హాజరయ్యారు. కాగా, ఈ ఫినాలే జరుగుతుండగా షణ్ముఖ ప్రియకు విజయ్ దేవరకొండ విషెస్ తెలియజేయడమే కాకుండా తన సినిమాలో పాటను పాడే అవకాశం కూడా ఇవ్వడం విశేషంగా మారింది. విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనిపించడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37K5nfU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...