Sunday, 1 August 2021

HBDBobby : డైరెక్టర్ బాబీ బర్త్ డే.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరు.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవికి ఎదుటి వారిని సర్ ప్రైజ్ చేయడం, వారికి బహుమతులు ఇవ్వడం వంటి అలవాట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాను పని చేసే దర్శకులు, నిర్మాతలకు ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తుంటారు. ఇతర హీరోలకు సైతం అప్పుడప్పుడు చిరు బహుమతులు అందుతుంటాయి. అయితే తాజాగా తన దర్శకుడు బాబీని సర్ ప్రైజ్ చేశారు. ఉదయం చిరు ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసినట్టున్నారు. బర్త్ డే సందర్భంగా చిరు ఆశీర్వాదంతో పాటు అదిరిపోయే బహమతి కూడా వచ్చింది. ఓ ప్రత్యేకమైన కలాన్ని దర్శకుడు బాబీకి చిరు బహుమతిగా ఇచ్చారు. ఇక ఆ పెన్నుతోనే తన స్క్రిప్ట్‌ను కూడా పూర్తి చేయమని చెప్పి ఉంటారు. అయితే ఇలా ఓ అభిమాని స్థాయి నుంచి దర్శకుడిగా చిరంజీవి చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడంతో బాబీ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు చిరు వీడియోను షేర్ చేస్తూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మన మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్యూ.. నేను ఆదర్శంగా తీసుకునే చిరంజీవి దగ్గరి నుంచి బర్త్ డే సందర్భంగా ఆశీర్వదాలు లభించాయి.. కొన్ని లక్షల మందిలో నేను కూడా ఒక అభిమానిని. ఇది నాకు కచ్చితంగా కల నెరవేరిన రోజు. ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని బాబీ ఎమోషనల్ అయ్యారు. అయితే చిరుతో చేయబోయే సినిమా స్పెషల్‌గా ఉండబోతోందని, దసరాకు ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. అసలైతే ఓ గంట పాటు నెరేషన్ ఇవ్వడంతో చిరు ఇంప్రెస్ అయ్యారట.. ఇందులో అభిమానులు కోరుకునే ప్రతీ అంశం ఉంటుందట. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. చివరగా బాబీ వెంకీ మామతో తన సత్తా చూపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wz0Dre
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...