Saturday, 28 August 2021

HBD Nagarjuna: అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌.. నవ మన్మథుడిగా వెలిగిపోతున్న బిగ్ బాస్

అక్కినేని నట వారసుడిగా, సీనియర్ హీరో నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు తెరపై 'ఎదురులేని మనిషి'గా 'సూపర్' స్పీడులో దూసుకుపోతున్నారు . అమ్మాయిల మనసులను కొల్లగొడుతూ నవ మన్మథుడిగా నేటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తూ షాకిస్తున్న ఆయన.. బిగ్ బాస్‌గా ప్రతి ఇంట సందడి చేస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ తనదైన ఎనర్జీతో మ్యాజిక్ చేస్తూ వైవిద్యభరితమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. మాస్ హీరోగా, క్లాస్ ఆడియన్స్‌ని మెప్పించగల సత్తా నాగార్జున సొంతం. అన్నమయ్య, షిరిడి సాయిగా మైమరిపిస్తూ అలాంటి రోల్స్ చేయడం నాగార్జునకు మాత్రమే సాధ్యం అనేలా చేశారు. ఇతర హీరోలతో పోల్చితే రొమాంటిక్ డోస్ దట్టిస్తూ వెండితెరపై రొమాన్స్ చేయడంలోనూ నాగార్జునదే పైచేయి. క్లాస్, మాస్, భక్తి, రక్తి ఇలా అన్ని కోణాల్లో హవా నడిపిస్తున్న ఈ కింగ్ పుట్టిన రోజు ఈ రోజు (ఆగస్టు 29). ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అక్కినేని నటవారసుడిగా సినీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్న నాగార్జున.. బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ హోస్ట్‌గా బుల్లితెర ఆడియన్స్‌ని ఫిదా చేస్తూ ఆ షోకి భారీ టీఆర్ఫీ తెచ్చిపెడుతున్నారు. మరికొద్ది రోజుల్లో నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం కానుంది. మరోవైపు రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బంగార్రాజు' సినిమాతో బిజీగా ఉన్నారు నాగార్జున. అందానికి బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా, ఎలాంటి క్యారెక్టర్ అయినా తనకు కొట్టిన పిండి అన్నట్లుగా తెలుగు తెరపై వెలుగు వెలుగుతున్న నాగార్జునకు 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WDx9c2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...