Monday, 9 August 2021

HBD Mahesh Babu : SSMB28 అప్డేట్ అదిరిందిగా.. పూజా హెగ్డేతో మళ్లీ రొమాన్స్

బర్త్ డే (ఆగస్ట్ 9) సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండుగే పండుగ. ఓ వైపు సర్కారు వారి పాట టీజర్ దుమ్ములేపుతోంది. ఇక మరో వైపు అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. మాటల మాంత్రికుడు మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. అసలే అతడు, ఖలేజా వంటి సినిమాల తరువాత జట్టు కట్టిన కాంబినేషన్ కావడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. దానికి తగ్గట్టే త్రివిక్రమ్ కూడా భారీ ప్లాన్లు వేసినట్టు కనిపిస్తోంది. SSMB28పై ఇది వరకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక తాజాగా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించబోతోంది. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారని ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1Kiue
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...