Saturday, 28 August 2021

Getup Srinu : సంచలన నిర్ణయం తీసుకున్న గెటప్ శ్రీను.. అనుమానాలు రేకెత్తిస్తోన్న ‘రాజు యాదవ్’

జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా గెటప్ శ్రీనుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర కమల్ హాసన్ అంటూ ఆయన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటారు. బుల్లితెరపై తన నటనతో సంపాదించుకున్న క్రేజ్‌తో వెండితెరపై చాన్స్‌లు కొట్టేశారు. సైడ్ క్యారెక్టర్ల నుంచి ఇప్పుడు మెయిన్ లీడ్ వరకు ఎదిగారు. కమెడియన్‌గా చేస్తూనే హీరోగాను ట్రై చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చేతిలో దాదాపు అర డజను చిత్రాలున్నాయి. అయితే దీంట్లో దాదాపు సగానికి పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నవే. కానీ అనే సినిమాతో మాత్రం గెటప్ శ్రీను సోలో హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వరకే త్రీ మంకీస్ అంటూ సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను వెండితెరపై సక్సెస్ కోసం ప్రయత్నించారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. త్రీ మంకీస్ దారుణంగా బెడిసి కొట్టింది. అందుకే ఆ తరువాత ఎవరి దారిలో వారు వెళ్తూ.. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు యాదవ్ అంటూ గెటప్ శ్రీను రాబోతోన్నారు. రాజు యాదవ్ పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా బాగానే క్లిక్అయ్యాయి. అయితే గెటప్ శ్రీను తాజాగా ఓ విషయాన్ని ప్రకటించారు. తాను కొంత కాలం పాటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను.. మళ్లీ తిరిగి వస్తాను అని ప్రకటించాడు. దీంతో కరోనా ఏమైనా సోకిందా? లేదా సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం మూలానా ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ఆయన అభిమానులు అనుమానాలతో హైరానా పడుతున్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అని చెబుతూ.. ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవని చెప్పకనే చెప్పేశారు. మరి గెటప్ శ్రీను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయనకే తెలియాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sViPHH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...