Tuesday, 31 August 2021

ఆ పని చేస్తున్న హీరో నాని.. ఇంకా కామెంట్స్ చేయాలి అంటూ అభిమానులకు సూచన

హీరోగా నటించిన ‘’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు. ‘‘నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో తేదీని ఖాయం చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాని అభిమానులు.. ట్రైలర్ ఎప్పుడంటూ వెంటపడుతున్నారు. ఈ సందర్భంగా షైన్ స్క్రీన్ సంస్థ నాని వీడియోను పోస్ట్ చేసింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండగా.. తాజాగా అమెజాన్ ప్రైజ్ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని పోస్ట్ చేసింది. హీరో నాని ‘టక్‌ జగదీష్’ సినిమాపై వస్తున్న కామెంట్లు అన్ని చూస్తున్నారు అంటూ అమెజాన్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నాని ఇంకా చేయండి.. అంటూ లేదా.. సినిమా త్వరగా చూసేయండి అంటూ అనే చెప్పే విధంగా సైగలు చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక టక్‌ జగదీష్ ఓటీటీ విడుదల విషయంలో చాలా వివాదాలు జరిగాయి. ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడాన్ని థియేటర్ల యాజమాన్యలు తీవ్ర వ్యతిరేకత చూపించాయి. అసలు నాని సినిమాలు ఏవీ థియేటర్‌లో విడుదల కాకుండా చూస్తామంటూ కూడా హెచ్చరికలు జారి చేశాయి. కానీ, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించాయి. ఇక, ఈ సినిమా విషయానికొస్తే.. ఈ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఏకంగా 45 కోట్లు చెల్లించి ఈ మూవీ హక్కులు అమెజాన్ ప్రైమ్ తీసుకుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mMQsKM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...