Saturday, 7 August 2021

జీవితంలో మరువలేని అనుభూతి అది.. వెంటాడే జ్ఞాపకాలు.. కాజల్ అగర్వాల్ ఎమోషనల్ కామెంట్స్

సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అందం, అభినయం గురించి బాగా తెలుసు. కెమెరా ముందుకొచ్చిందంటే తనదైన నటనతో అట్రాక్ట్ చేస్తుంటుంది కాజల్. అలా గత పదహారేళ్లుగా కెరీర్ కొనసాగిస్తూ యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్‌గా తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. గుట్టుచప్పుడు కాకుండా అతనితో ప్రేమాయణం నడిపించి చివరకు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటైంది. అయితే పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన లేటెస్ట్ హిందీ మూవీ '' షూటింగ్ ఫినిష్ చేసింది. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రియార్టీ ఇస్తున్న కాజల్.. అదే బాటలో ఈ 'ఉమ' మూవీ కంప్లీట్ చేసింది. పెళ్లి నేపథ్యంలో ఆసక్తికర పాయింట్ తీసుకొని ఈ సినిమా పూర్తి చేశారు. అయితే చిత్ర షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమాపై తన అభిప్రాయం తెలుపుతూ ఎమోషనల్ అయింది కాజల్. ఇలాంటి సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం అని చెప్పిన ఆమె, షూటింగ్‌ పూర్తయ్యాక కూడా మనల్ని వెంటాడే పాత్రలు కొన్నే ఉంటాయి.. అలాంటిదే ఉమ రోల్ కూడా అని చెప్పుకొచ్చింది. అందమైన అద్భుతమైన కథ ఇది అని తెలిపిన కాజల్, ఈ సినిమాలో నటించిన కిక్ లైఫ్‌లో మరువలేనని చెప్పింది. ఇకపోతే 'ఉమ' షూటింగ్ ఫినిష్ అయిన నేపథ్యంలో ఆ సినిమాలోని క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో టిన్ను ఆనంద్‌, గౌరవ్‌ శర్మ, హర్ష ఛాయా, మేఘనా మాలిక్‌ తదితరులను చూపించారు. చివరలో కాజల్‌ని కనిపించి కనిపించనట్టు చూపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' మూవీ చేస్తున్న కాజల్, ఆ సినిమాకు కూడా త్వరలోనే ఫినిష్ చేయనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VBnmTg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...