ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారిపోయారు నాచురల్ స్టార్ నాని. సహజమైన నటనతో ఆయన ప్రేక్షకులకు ఎంతో చేరువ అయ్యారు. చూడటానికి మన పక్కింటి కుర్రాడి ఉండే నటన చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కామెడి అయినా, సెంటిమెంట్ అయినా.. ఆయన అద్భుతంగా పండించగలరు. ఈ మధ్యకాలంలోనే విలన్‌గా కూడా మారిపోయారు నాని. తన కెరీర్‌లో 25 సినిమాగా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’ అనే సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. ఇక ఇప్పుడు నాని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ‘టక్ జగదీష్’ సినిమా ఒకటి. మరోకటి సంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’. టక్ జగదీష్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుంటే.. శ్యామ్ సింగరాయ్ పశ్చిమ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఇదే రూట్‌లో వెళ్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో పాటు ఆయన నటిస్తున్న మరో సినిమా ‘’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రేపు(శుక్రవారం) అప్‌డేట్ వస్తుందని నాని.. పరోక్షంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆయన చాలా సింపుల్‌లో ‘టుమారో’ అంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో రేపు ‘అంటే సుందరానికి’ నుంచి అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే.. రేపటి వరకూ ఎవరు చూడాల్సిందే. ఇక ఈ సినిమా ద్వారా ‘రాజా రాణీ’ ఫేమ్ నజ్రియా నజీమ్ తెలుగులో ఆరంగేట్రం చేయనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sRTj6m
v
No comments:
Post a Comment