Thursday, 26 August 2021

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి డబుల్ బోనంజా.. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకలు రెడీ!

తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పుట్టినరోజు సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంటే మరోవైపు దర్శకనిర్మాతలు ఆ అభిమానులను సర్‌ప్రైజ్ చేసే అప్‌డేట్స్ రెడీ చేస్తుంటారు. ఇటీవలే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులు ఖుషీ అయ్యే అప్‌డేట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పుట్టినరోజున అంతకుమించి అన్నట్లుగా ఆయన బర్త్ డే ట్రీట్స్ రెడీ చేసి పెట్టారని తెలుస్తోంది. 'వకీల్ సాబ్' సినిమాతో గ్రాండ్ రీ- ఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే సెట్స్‌పై హవా నడిపిస్తున్నారు. భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా రెండు భారీ కానుకలు రెడీ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి కీలక అప్డేట్ రానుందని, అలాగే రానా దగ్గుబాటితో కలిసి ఆయన నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ 'భీమ్లా నాయక్' నుంచి కూడా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారని సమాచారం. 'హరిహర వీరమల్లు' సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న డైరెక్టర్ క్రిష్.. కానుకగా పవర్ స్టార్ అభిమానులను ఫిదా చేయాలని బలంగా ఫిక్సయ్యారట. ఈ మేరకు ఈ భారీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు పవన్ బర్త్ డే కోసం అయాన్ ఫ్యాన్స్ స్పెషల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38cARMf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...