Friday, 6 August 2021

ఓంకార్‌తో సినీ నటి రిలేషన్.. అలా బయటపెట్టిన సుడిగాలి సుధీర్! సీనియర్ హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

సుడిగాలి సుధీర్, , ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై నానా హంగామా చేసే వారి లిస్టు పెద్దగానే ఉంటుంది. వీళ్ళతో పొట్టచెక్కలయ్యే వినోదం పంచుతూ సరికొత్తగా స్కిట్స్ వేయిస్తున్నారు బుల్లితెర షో నిర్వాహకులు. ఒక్కటేమిటి అన్ని ఛానెల్స్‌లో వీళ్ళ హడావిడే కనిపిస్తోంది. ఇక ఈ షోస్ ప్రోమోలు రిలీజ్ చేసి సృష్టించే అలజడి అయితే మాటల్లో చెప్పలేం. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకొని ఓ వారం రోజుల ముందు నుంచే షో టాక్ జనం నోళ్ళలో నానేలా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన 'సిక్త్ సెన్స్' ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. ఎక్కువగా ఈటీవీ షోస్ చేసే ఈ సారి మా టీవీలో ప్రసారం కాబోతున్న 'సిక్త్ సెన్స్' ప్రోగ్రాంలో తళుక్కున మెరిశాడు. అంతేకాదు ఈ వేదికపై ఇంద్రజతో కలిసి ''నీతో సాయంత్రం ఎంతో సంతోషం'' పాటకు స్టెప్పులేసి హూషారెత్తించాడు. ఆ వెంటనే ఓ సెటైరికల్ కామెంట్ చేసి అటు ఓంకార్‌కి, ఇటు ఇంద్రజకు ఊహించని షాకిచ్చాడు. ఆ ఇద్దరి మధ్య రిలేషన్ తెలిసేలా ఓపెన్‌గా మాట్లాడేశాడు సుధీర్. సుడిగాలి సుధీర్ నటించిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్' సినిమాలో అతని తల్లిగా ఇంద్రజ నటించింది. అప్పటి నుంచి ప్రతి షోలోనూ సుధీర్‌ని తన కొడుకు అని చెబుతుంటుంది ఇంద్రజ. అదే పాయింట్ ఆసరాగా తీసుకొని ‘సిక్త్ సెన్స్' షోలో ఓంకార్‌ కూడా ఇంద్రజకు పెద్ద కొడుకు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు సుధీర్. దీంతో ఇంద్రజ షాకవ్వడమే గాక ఆయన నా కొడుకని నేను చెప్పానా? అంటూ సుధీర్‌పై కౌంటర్ వేసింది. దానిపై సుధీర్ రియాక్ట్ అవుతూ 'నేను అన్నా అంటున్నా కాబట్టి ఆయన కూడా నీకు కొడుకే కదా' అంటూ లాజిక్ మాట్లాడాడు. ఇక దీనిపై ఇంద్రజ స్పందిస్తూ ''మీరు ఎంతో మందిని అన్నయ్య అని పిలుస్తారు. వాళ్లందరూ నాకు కొడుకులైపోతారా?'' అంటూ నవ్వుతూనే సుడిగాలి సుధీర్ గాలి తీసేసింది. దీంతో ఆమెను అమ్మా అని పిలుస్తూ దండం పెట్టేయడం సుధీర్ వంతైంది. ఈ చిన్న ఫన్ కాన్సెప్ట్‌తో వీడియో తెగ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jwuMPF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...